ఓటమ్ లైన్

తలమాసినోళ్లు అదేలెండి, మేథావులు ఓ.. తెగ సెప్పెత్తుంటారు. ఆళ్ల మాటలు మాత్రం నమ్మకండి.

Advertisements

బ్లాక్ బస్టర్ హిట్

వాళ్లే లేకపోతే ఈ ఎన్నికలు ఇంత మజాగా ఉండేవి కావు అనేది కాదనలేని సత్యం.

కవనం వదిలివెళ్లిన శర్మగారు..

kavana

‘‘సార్‌.. మీ కథ ‘టపటపలాడుతున్న రెక్కలు’ చాలా బావుంది. పిల్లలు, చదువు అనే విషయాలు వచ్చేసరికి చాలామంది అటు కాలేజీలనో, ఇటు తల్లిదండ్రులనో విలన్లుగా చూపిస్తారు. అలాకాకుండా, తల్లిదండ్రులలోని ఆందోళన మీద ఫోకస్‌ చేయడం బావుంది. ముఖ్యంగా కథ నడిపిన తీరు..’’
‘‘సార్, మీరు..’’
‘‘నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి’’
వెంటనే అలర్ట్‌ అయ్యా. గొంతును బట్టి పెద్దాయన అని గుర్తుపట్టా. ఖచ్చితంగా వివిన మూర్తిగారే అనుకున్నా.
కానీ, ఆయన చాలా మామూలుగా ‘‘నన్ను కవన శర్మ అంటారండి’’ అన్నారు.
అంతే, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాస్త తేరుకుని ‘‘సార్‌.. మీరు నన్ను మీరు, అండి అనక్కర్లేదు. మీకన్నా చాలా చిన్నవాడిని’’అన్నా.
ఆయన అంతే మామూలుగా నవ్వేసి ‘‘నేను చదివి, బావుంది చదవమని మా ఆవిడకు ఇచ్చా’’ అని చెప్పారు.
అలా ఆయనతో అదే చివరి సంభాషణ అవుతుందని అనుకోలేదు. గతంలో విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఇతర మిత్రులతో కలిసి కవనశర్మగారిని చాలాసార్లే కలిశా. నాతోనే కాదు, ఆయన ఎవరితోనైనా అంతే నిర్మలంగా మాట్లాడతారు. ఆయా రచయితల స్థాయీభేదాలు పట్టించుకోరు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ చలాకీగా ఉంటారు. నిరంతరం చదువుతూ, రాస్తూ వుంటారు. అంతేకాదు, మరోవైపు సినిమాలను కూడా వదిలిపెట్టరు. పైగా, యువతరంతో పోటీ పడుతూ తన అభిప్రాయాలను ఫేస్‌బుక్‌ ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూనే ఉంటారు. టాటానగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో పనులు చక్కబెడుతున్నట్టు, వారానికి ఓసారి విశాఖ వెళ్లి వస్తున్నట్టు, నిచ్చెనలు ఎక్కి బల్బులు మారుస్తున్నట్టు ఆయన పెట్టే పోస్ట్‌లు చూసేవారెవరికీ ఆయన ఇలా హఠాత్తుగా వెళ్లిపోయారంటే నమ్మబుద్ధికాదు.
ఆయనో పెద్ద ప్రొఫెసర్‌ అనీ, దేశవిదేశాల్లో పనిచేశారని–చెబితే తప్ప ఎవరికీ తెలీదు. అంత సాదాసీదాగా వుండే 80ఏళ్ల పెద్ద మనిషి, కవనశర్మగా అందరికీ తెలిసిన కందుల వరహ నరసింహశర్మ  అంతే నిమ్మళంగా ఈనెల 25న బెంగళూరులోని తన ఇంటి నుంచే కాదు, ఈ లోకం నుంచే నిష్క్రమించారు. ఆ రోజు తెల్లవారుజామున అయిదు గంటలకు ‘కొన్నిసార్లు కొన్ని విధానాలు పని చేస్తాయి. చెప్పిన కారణాలకి కాదు. ఖ్ఛటul్ట జీటటజీజజ్టి. ఈ్ఛటజీఠ్చ్టిజీౌn జీటఠీటౌnజ’అంటూ ఓ పోస్ట్‌ పెట్టారు. అదే ఆయన చివరి పోస్ట్‌ అని ఆయనకీ తెలీదు..
పేరులోనే కవనాన్ని ఇముడ్చుకున్న ఆయన 14వ ఏటనే రాయడం ప్రారంభించారు. సీరియస్‌ రచనలకంటే హాస్యానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. కానీ, సాహితీవేత్తలందరూ ఆయన సీరియస్‌ కథలనే గుర్తుపెట్టుకోవడం ఓ విరోదాభాస. ఆమె ఇల్లు కథలోని కమలను ఇప్పటికీ మరిచిపోనివారెందరో. అలాగే ‘విడాకులు’ కథను కూడా. ఆంధ్రపత్రికలో వచ్చిన బ్రెయిన్‌ డ్రెయిన్‌ కథలు, జ్యోతి మాసపత్రిక దీపావళి సంచికలో ప్రచురితమైన బంగారు రోజులు నవల, ఇరాక్, యుథియోపియా అనుభవాలతో చేసిన రచనలు, వ్యంగ్య కవనాలు ఆయనకు ఎందరో అభిమానులను సాధించి పెట్టాయి. వీటన్నిటితోపాటు సైన్స్, విద్య, సినిమా సంబంధ వ్యాసాలు కూడా చాలానే రాశారు. తెలుగు సాహిత్యంలో ఇలా బహుముఖమైన ప్రజ్ఞగల వారు చాలా అరుదు. అటువంటి విస్త తిగల కవనశర్మగారు ఇలా నిష్క్రమించడం నిజంగా తీరని లోటు.