గుల్జార్‌ కో ఏక్ గుల్దస్తా!

దేశ విభజన, మత విద్వేషాలు, సామూహిక హత్యలు, చెల్లాచెదురైపోయిన జీవితాలు, గుండెలు పగిలిన కలలు.. దేశంపైని పుట్టుమచ్చలైతే, ఆ మచ్చల మధ్య ఓ మధురమైన విషాదపు టాటూ గుల్జార్.

ఆలీబాబాఅనేకదొంగలు.. దేశరాజు కథలు

-సి. సుజాత నవల కి సూష్మ రూపమే కదా కథ. పూర్తి  జీవితం గురించి చదివిన ఫీలింగ్ వస్తుంది కనుకే నాకు కథే ఇష్టం. సంపుటిలోని 13కథలు చాలా కథలు వివరంగా రాయవలసినంత బాగున్నాయి. చిలుక…..కూడా అపార్ట్… Read more “ఆలీబాబాఅనేకదొంగలు.. దేశరాజు కథలు”

కథలు చెప్పని మాస్టారు

ఇది కారా మాస్టారి శత జయంతి సంవత్సరం. సుమారు మూడు దశబ్దాల క్రితం సుందరపాలెం వంటి అనేకానేక గ్రామాల్లోని ఒక దానిలో నివసిస్తుండిన కాలం. కాకపోతే అది కూడా శ్రీకాకుళం జిల్లా కావడం యాదృశ్చికం మాత్రమే. అప్పుడప్పుడే… Read more “కథలు చెప్పని మాస్టారు”

ఆలీబాబా, అనేక దొంగలు

ఒక్క మనిషిని పట్టుకుని బోలెడంతమంది చుట్టుముట్టి చితగ్గొట్టడమా? అదీ వందలాది మంది చూస్తుండగానా? మరి, దీన్ని అడవి అనకపోతే, ఇంకేమంటారని నేను ఆవిడనుగానీ, మిమ్మల్నీ గానీ నిలదీయను. ముందే చెప్పాగా, మీరంతా ఇలాంటివాటికి అలవాటుపడిపోయి వుంటారని.

కవి దుర్భేద్య

‘వేల ఏళ్లుగా ఉదయిస్తున్న సూర్యుడికి వుందా రిటైర్మెంట్?/వీచేగాలికి ఏది విశ్రాంతి?/పాడే కోకిలకు ఎక్కడిది అలసట?/ నిరంతర పయనమే నీ లక్ష్యం/సాగిపో మిత్రమా’ అని గిలికి, చివర్లో శుభోదయం అని పెట్టాడు.

చిలుక

వినాయక చవితి రోజు మండపంలో పూజా కార్యక్రమం సాయంత్రం పెట్టారు.
ఆమె పట్టుచీర కట్టుకుంది. ఆయన పట్టు పైజామా, లాల్చీ వేసుకున్నాడు. బయల్దేరబోతుంటే ఆమె దగ్గరకు వచ్చి, ఆయన పక్కనే నిలబడి.. తన మొబైల్‌తో సెల్ఫీలు తీసింది. వారిద్దరితోపాటు వెనుక గోడకు తగిలించిన పెద్ద గిటార్ కూడా ఫొటోలో రావడంతో మంచి లుక్ వచ్చింది. దానికి తోడు ఆయన భుజంపై చిలుక వుండనే వుంది.

అవాంఛితం

చీర అందుకుంటూ నైటీ తొలగించింది. ఒక్కసారిగా చల్లని ఏసీ గాలి ఎక్కడెక్కడో తడిమింది. ఆమె ఒళ్లు వడగాడ్పులో చిగురాటాకులా వణికింది. ఆమెలో ఏవో పులకింతలు రేగాయి. ఉద్వేగాలు ఉబికాయి. శపథం సడలినందుకో, చిరాకాల వాంఛ అవాంఛితంగా ఇలా తీరుతున్నందుకో ఆమెలో దుఃఖం సుడులు తిరిగింది.

కవితో అక్షర ప్రయాణం

దేశరాజు మానవ సంబంధాలను అక్కున చేర్చుకున్న తండ్రి కూడా.
అందుకే  “సన్ రైజ్” లో కొడుకును, “రెక్క విప్పే పిట్ట” లో కూతుర్ని విలక్షణంగా చెప్పి మనసు గెలుచుకుంటారు.

సంవిధాన నైపుణ్యం – వినూత్న వస్తు స్వీకరణం

దేశరాజు శైలిలో చక్కని చదివించే గుణం ఒక తేజోరేఖ. దేశరాజు కథలలో ఇతివృత్తాలన్నీ ఈనాటి ఆధునిక జనజీవన విషాదాల్ని, మనుషుల జీవన శైలిలోని వైరుధ్యాల్ని ఆవిష్కరించాయి. రచయితగానే కాక దేశరాజుని సాంస్కృతిక, సామాజిక బాధ్యతల్ని ఈవిధంగా నెరవేరుస్తున్న ఉత్తమ పౌరునిగా కూడా అభినందించవలసిందే!